Header Banner

దీపం 2.0లో నూతన మార్గదర్శకాలు! లబ్ధిదారులు గమనించాల్సిన ముఖ్యాంశాలు ఇవే!

  Thu Feb 13, 2025 20:40        Politics

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తోంది. పేదల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన దీపం 2.0 పథకంలో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని గతేడాది అక్టోబర్‌ 31వ తేదీన ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 98 శాతం మందికిపైగా తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమైనట్లు అధికారులు వెల్లడించారు. దీపం పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో నమోదైనా గతంలో సెల్​ఫోన్ల నెంబర్ అనుసంధానం కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 'దీపం' లబ్ధిదారులు రూ.840 చెల్లించి సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.20 చొప్పున రాయితీ ఇస్తుండగా, మిగిలిన రూ.820 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. నేటికీ మొదటి సిలిండర్ బుక్ చేసుకోని వారు మార్చి 31వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!


1.08 కోట్ల మంది లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల డొమెస్టిక్ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా ప్రాథమిక అంచనా ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్‌ పథకానికి అర్హత సాధించాయి. అయితే, 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నప్పటికీ ఆధార్‌ సమర్పించకపోవడంతో అర్హత పొందలేకపోయారు. గ్యాస్‌ కనెక్షన్​తో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారు మాత్రమే 'దీపం 2.0' పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎవరెవరు అర్హులంటే!
దీపం పథకంలో భాగంగా ఉచిత సిలిండర్‌ పొందడానికి ఆధార్, రేషన్‌ కార్డు తప్పనిసరి.
కుటుంబంలో ఎవరి పేరుతోనైనా గ్యాస్‌ కనెక్షన్‌ ఉండొచ్చు.
లబ్ధిదారు పేరు రేషన్‌ కార్డులో ఉంటే చాలు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


భార్య పేరుతో రేషన్‌ కార్డు, భర్త పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా అర్హులే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఒక రేషన్‌ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు లేదా అంతకు మించి గ్యాస్ కనెక్షన్లున్నా రాయితీ ఒక్క దానికే వర్తిస్తుంది.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ రాయితీ అందుతుంది.
గ్యాస్‌ రాయితీ డబ్బులు జమ కావాలంటే E KYC పూర్తి చేసుకోవాలి.
E KYC ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ వద్ద పూర్తి చేసుకునే వీలుంది.
సిలిండర్‌ తీసుకున్న 48 గంటల్లో సంబంధిత ఇంధన సంస్థలు రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే 1967 (టోల్‌ ఫ్రీ) నంబరులో సంప్రదించవచ్చు.
గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినాగుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #freegas #cylinder #deepam2.0 #todaynews #flashnews #latestupdate